PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ భరత్​ను గెలిపించండి…

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు అభివృద్ధి చెందాలంటే…  కూటమి అభ్యర్థి టీజీ భరత్​ను గెలిపించాలని పిలుపునిచ్చారు బ్రాహ్మణ సంఘం నేతలు. మంగళవారం సాయంత్రం నగరంలోని దేవనగర్​ లో బ్రాహ్మణ సంఘం నాయకులు సివి దుర్గా ప్రసాద్​,  సండేల్ చంద్రశేఖర్, టివి రవిచంద్ర శర్మ, H దేవీప్రసాద్, టీడీపీ కార్యకర్తలు తదితరులు  ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సండేల్​ చంద్రశేఖర్​ మాట్లాడుతూ కర్నూలు స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దడానికి టీజీ భరత్​ పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారని, అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. సూపర్​ సిక్స్​ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కర్నూలు టీడీపీ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరూ సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా సండేల్​ చంద్రశేఖర్​ పిలుపునిచ్చారు.

About Author