PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలిసుందాం సాధించుకుందాం.. రాష్ట్ర అధ్యక్షులు అర్వపాలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  ఆత్మకూర్  నంద్యాల జిల్లా  ఆత్మకూరు పట్టణం నందు గల స్థానిక హోటల్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన వైద్య ఆరోగ్యఫ్శాఖ ఏపీ హంస ఆత్మకూరు సర్వసభ్య సమావేశమును ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు రఘుబాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు అర్వాపాల్ గారు పాల్గొని ప్రసంగిస్తూ కమిటీలన్నీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 జిల్లాలను తిరుగుతూ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికి మేలైన వైద్యం దొరుకు తుందంటే అది కేవలం హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నటు వంటి సిబ్బంది యొక్క సేవలేని తెలిపారు  కరోణా కాలంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలబడింది అంటే ప్రాణాలను లెక్కచేయకుండా ఇక్కడి సిబ్బంది పని చేశారని వీరి సేవలకు వెల కట్టలేమని తెలిపారు . ఈరోజు దేశంలోనే  వైద్య ఆరోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి  హంస అనే యూనియన్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సామరస్యంగా పరిష్కరించేందుకు  యూనియన్ సిబ్బంది పక్షాన ఉండి పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు,  రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్  జిల్లా కార్యదర్శి షఫీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నటు వంటి కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయడం చేయటంలో హంస యూనియన్ పూర్తిగా సహకరించిందని తెలిపారు  మీటింగ్అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఆత్మకూర్ తాలూకా నుండి ప్రవీణ్  ను జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఆత్మకూరు తాలూకా అధ్యక్షులుగా  కరుణాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా వి సరోజ,ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి శ్రీదేవి సోమక్క ఈసీ భాస్కరరావు, మౌళి భాష, సెక్రటరీగా లింగన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రహమతుల్లా ఖాన్ రత్నమ్మ, ట్రెజరర్ గా విశ్వనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరి చేత రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కలిసి ప్రమాణం చేపించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘుబాబు, నంద్యాల భాస్కర్ చంద్రుడు రవి నాగన్న తదితరులు పాల్గొన్నారు.

About Author