PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల :  జనవరి 31 నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరిగిన జిల్లా స్థాయి ఆడుదామా ఆంధ్ర క్రీడా పోటీలు శనివారంతో ముగిసాయని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పద్మావతి నగర్ లోని ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ట్రోఫీలు మెడల్స్, సర్టిఫికెట్లను జాయింట్ కలెక్టర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డిఓ మల్లికార్జునరెడ్డి, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మరియు పీడీలు, సంబంధిత జట్ల శిక్షకులు, మేనేజర్లు, జిల్లా క్రీడాపురాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author