PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు చేయూతగా లయన్స్ క్లబ్ సహాయం

1 min read

లయన్స్ క్లబ్ సేవా దృక్పథంతో పనిచేస్తుంది:- వై. నాగేశ్వరరావు యాదవ్💐లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్💐

పల్లెవెలుగు వెబ్ నెల్లూరు:  నెల్లూరు లోని లయన్స్ క్లబ్ అఫ్ గూడూరు వరద బాధితులకు శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వై గురునాథం ,కార్యదర్శి  గోపీనాథ్ రెడ్డి, ట్రెజరర్ మనోజ్ కుమార్ అద్వర్యం లో సభ్యుల సహకారం తో మెగా సహాయక కార్యక్రమాన్ని నిర్వహించారు, గూడూరు  డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్316జె డిస్టీక్ట్ గవర్నర్ వై .నాగేశ్వర్ రావు యాదవ్ తో పాటు మొదటి ,రెండవ వైస్ డిస్టీక్ట్ గవర్నర్ లు M .గౌతమ్,  ఎన్. వెంకట్రామరాజు, టీ.వీ.రత్న ప్రసాద్ మరియు ప్రముఖ రాష్ట్ర బీసీ నాయకులు బొమ్మి సురేంద్ర గారు, దశరథ నాగేంద్ర ప్రసాద్ గారు. మరియు పలమాల శ్రీహరి . పాల్గొన్నారు, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో లయన్స్ క్లబ్ అఫ్ గూడూరు, వారు  ఏర్పాటు చేసిన వరదబాధితుల సహాయములో భాగంగా 200 కుటుంబాలకు సుమారు 1000 రూపాయిలు విలువ చేసే దుప్పట్లు,చీరలు,ఇంటికి ఉపయోగపడే స్టీల్ సామాగ్రి తో పాటు టవళ్లు,లుంగీలు, బ్యాగులు అతిధులు చేతులు మీదుగా పంపిణి చేయడం జరిగింది,ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్  మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా దృక్పథంతో పని చేస్తుంది. ద్వారా రోజుకు కొన్ని కోట్ల రూపాయలు వీక్షించి ప్రజలకు సేవ చేసింది.లయన్స్ క్లబ్ లను ఏర్పాటు చేయడంలో ఒకరినొకరు సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. నూతన క్లబ్స్ ను,ఎం జె ఎఫ్ లను ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో లయన్స్ క్లబ్స్ నిర్మించి పేద ప్రజలకు అన్ని విధాలా లయన్స్ క్లబ్ సేవలు అందించాలి.కర్నూలులో లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా డయాలసిస్ ఆర్ఆర్ హాస్పిటల్ లో.అదేవిధం గా నెల్లూరులో బ్లడ్ బ్యాంక్,నంద్యాలలో డయబిటిక్ సెంటర్ లను లయన్స్ క్లబ్స్ అద్వర్యం లో ఏర్పాటుచేయబోతున్నాము . కావున పేద ప్రజలందరూ ఈ ఉచిత  వైద్య, సేవలను ఉపయోగించుకోవాలి. లయన్స్ క్లబ్ సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి.లయన్స్  క్లబ్స్ ను ఏర్పాటు చేసుకుంటే అపరితమైన సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయవచ్చు.లయన్స్ క్లబ్ లను పెంచడంలో కొత్త సభ్యులు చేర్పించడంలో లయన్స్ క్లబ్ నాయకులందరూ సహకరించి.నూతన క్లబ్స్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలి.లయన్స్ క్లబ్ ప్రేమ, సేవలు, అంకితభావం కలిగి ఉండాలి.అన్ని జిల్లాలు కన్నా లయన్స్ క్లబ్ 316జె ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది.నూతన క్లబ్స్ అన్ని కూడా సేవ అంకిత భావం తో ముందుకు వెళ్ళాలి.లయన్స్ క్లబ్ గ్లోబల్ హంగర్ పై దృష్టి సాధించాలి. లయన్స్ క్లబ్ సేవలో భాగంగా డయబిటిస్,గ్లోబల్ హాంగర్,వివిధ వైద్య సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్టు వృద్ధులు మరియు వికలాంగుల ఆశ్రమము లో ఒక రూమును శుభ్రం చేసి వాళ్లకు సదుపాయం అందించబడినది. అలాగే గూడూరులో ఉన్న  మూడు క్లబ్బులు అయిన గూడూరు, గూడూరు వైజేపీ, గూడూరు టౌన్ క్లబ్బులను కూడా విజిట్ చేయడం జరిగింది.

About Author