PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జెమ్​ కేర్​ కామినేని’లో.. లైవ్​ ఆర్థోస్కోపి సర్జరీ..

1 min read

ముగ్గురి రోగులకు ఉచిత ఆర్థోస్కోపి సర్జరీ…

  • లైవ్​లో యువ వైద్యులకు శిక్షణ ఇచ్చిన సీనియర్​ వైద్యులు
  • అధునాతన పరికరాలతో… మొదటిసారి లైవ్ ఆర్థోస్కోపి సర్జరీ
  • జెమ్ కేర్​ కామినేని హాస్పిటల్​ సీఈఓ డాక్టర్​ ఎస్​.వి. చంద్రశేఖర్​

పల్లెవెలుగు, కర్నూలు: రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా స్మిత్​ నెఫ్యూ  కంపెనీ వారి సహకారంతో కర్నూలులోని జెమ్ కేర్​ కామినేని హాస్పిటల్​ ఆధ్వర్యంలో లైవ్​ ఆర్థోస్కోపి సర్జరీ నిర్వహించారు.  లైవ్​ ఆర్థోస్కోపి కార్యక్రమాన్ని ప్రముఖ ఆర్థోపెడక్ వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి , డాక్టర్ ఉమనాథ్ , కర్నూల్ ఆర్థోపెడక్ సొసైటీ హెడ్ డాక్టర్ రమణ మరియు ఆర్థోపెడిక్ హెడ్ డాక్టర్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీఈ ఓ డాక్టర్ ఎస్.వి. చంద్రశేఖర్ , డాక్టర్ జి.వి.ఎస్ రవిబాబు ,స్మిత్ నెఫ్యూ అకాడమీ మేనేజర్ గురు ప్రసాద్  మాట్లాడుతూ దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ప్రముఖ అర్థస్కోపి వైద్యులు డాక్టర్ ప్రథమేష్ జైన్,డాక్టర్ చిరగ్ తొంసే , డాక్టర్ ప్రదీప్ కుమార్ చేత జెమ్ కేర్  కామినేని హాస్పిటల్ నందు తీవ్రంగా మోకాలు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న ముగ్గురు రోగులకు లక్షల రూపాయలు విలువ చేసే ఆర్తోస్కోపి సర్జరీని ఉచితంగా  చేశారు. అలాగే దానికనుగుణంగా లైవ్ స్క్రీన్లో ఆర్థోస్కోపి సర్జరీని రాయలసీమలోని మొదటిసారిగా 100 మంది యువ ఆర్తోస్కోపి వైద్యులకు అవగాహన కొరకు లైవ్ సర్జరీ ద్వారా వారి సందేహాలను తెలియజేస్తూ శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రముఖ వైద్యులు జరిగినటువంటి ఆపరేషన్ యొక్క కొత్త వైద్య నైపుణ్యాలను యువ వైద్యులకు నేర్పించడం జరిగింది. ఇదంతా కామినేని హాస్పిటల్ నందు అధునాతనమైన వైద్య పరికరాల వల్లే సాధ్యమైందని,  ఇలాంటి అనేక ఆర్తోస్కోపి చికిత్స కర్నూల్ నగరంలో డాక్టర్ రవిబాబు  చేత చేసిన అనుభవం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వారికి ఉందని తెలియజేశారు.జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.  సమావేశంలో సీఈవో డాక్టర్ గణేష్, మార్కెటింగ్ డీజిఎం రమణబాబు, మార్కెటింగ్ జిఎం షేక్షావలి, హాస్పిటల్ ఆపరేషన్ హెడ్ నదీమ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author