PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీవన ఎరువు.. ‘ వ్యామ్​ గోల్డ్​–డి’ పై రైతులకు అవగాహన

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నాణ్యమైన సేంద్రీయ, జీవన ఎరువులు అందించడంలో ‘షణ్ముఖ అగ్రిటెక్​ లిమిటెడ్​’ ఏపీలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు ఆ సంస్థ రీజనల్​ సేల్స్​ మేనేజర్​ వై. శేఖర్​ బాబు. మంగళవారం కర్నూలు మండలం గార్గేయపురం, ఉల్చాల, రేమట, పసుపుల గ్రామాలలో జీవన ఎరువులైన విరాట్​ ఆర్గానిక్​ మాన్యుర్​, విరాట్​ ప్రోమ; విరాట్ సీఎంఎస్​, వ్యామ్​గోల్డ్​–డి తదితర జీవన ఎరువుల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వై. శేఖర్​ బాబు మాట్లాడుతూ సేంద్రీయ, జీవన ఎరువుల వాడకం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని, అంతేకాక పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. తమ సంస్థ నూతనంగా తయారు చేసిన ‘ వ్యామ్​ గోల్డ్​–డి ’ వాడకం వల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు మండలం ఏరియా సేల్స్​ ఆఫీసర్​ సి. మధు, బి.లాల కృష్ణ, మార్కెట్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్లు రాజేష్​; పెద్ద వీరన్న, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

About Author