PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్య భగవానుడికి.. ధనుర్మాస పూజ..

1 min read

పల్లెవెలుగు, కర్నూలు:శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రతినెలా జరిగేటటువంటి సంక్రమణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధనుస్సంక్రమణ ధనుర్మాస  పూజలలో మొదటి రోజు ప్రాతః కాలమునందు శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్య జలాభిషేకము, క్షీరాభిషేకము, పురుష సూక్త విధానంతో  అరుణ పారాయణా పూర్వకముగా ధనుర్మాస నెల రోజులకు సంకల్పం చేసుకున్నటువంటి భక్తాదుల గోత్రనామములతో అభిషేకం, అర్చన, మంత్రపుష్పం, వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం ధన్వంతరి హోమ పూర్వకముగా సూర్యపంచాయతన హోమము చేశారు.  ఆ తరువాత దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి, కమిటీ సభ్యుల నేతృత్వంలో భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదం అందజేశారు.

About Author