NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌త‌మార్పిడుల‌కు వ్యతిరేకంగా అమ్మూ వివాదాస్పద వ్యాఖ్యలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌ర్ణిసేన అధ్యక్షుడు సూర‌జ్ పాల్ అమ్మూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ల‌వ్ జీహాద్, మ‌త‌మార్పిడుల‌కు వ్యతిరేకంగా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక మ‌తానికి చెందిన వారు మీసాలు క‌త్తిరించార‌ని, కానీ త‌మ‌కు గొంతు కోసే సామ‌ర్థ్యం ఉంద‌ని .. వారిని దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒక నిర్ధిష్ట మ‌తానికి చెందిన వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. ప‌టౌడీలో 17 మంది అమ్మాయిలు ల‌వ్ జీహాద్ ఎదుర్కొన్నార‌ని, మ‌త‌మార్పిడులు, భూక‌బ్జాలు పెరిగిపోయాయ‌ని ఆయ‌న ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డంతో.. అమ్మూపై చ‌ర్యలు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. అమ్మూపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేద‌ని పోలీసులు చెబుతున్నారు.

About Author