PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం

1 min read

ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, సిలిండర్లపై అదనపు రవాణా చార్జి వసూలు చేసే వారిపై చర్యలు..

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, సిలిండర్లపై అదనపు రవాణా చార్జి వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలను హెచ్చరించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాల శాఖ అధికారులతో మరియు జిల్లాలోని వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేటప్పుడు రవాణా చార్జి కింద అదనపు చార్జీలు వసూలు చేయరాదని అలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేసే ఏజెన్సీలపై  చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే డెలివరీ బాయ్స్ పై ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు తమ గోదాము నుంచి ప్రతిరోజు పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్లు వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో సక్రమంగా నమోదు చేయాలన్నారు.గ్యాస్ కంపెనీల వారి నామ్స్ ప్రకారం గ్యాస్ గోడౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వినియోగదారులకు ఏలాంటి గ్యాస్ సిలిండర్ రవాణా రుసుము వసూలు చేయరాదని గోడౌన్ నుంచి 5 కిలోమీటర్లు దాటి15 కిలోమీటర్లు ఉన్నట్లయితే సిలిండర్ రవాణా చార్జి కింద 20 రూపాయలు. గోడౌన్ నుండి15 కిలోమీటర్లు దాటి 30 కిలోమీటర్లు వునట్లుఅయితే 30 రూపాయలు అదనపు చార్జీ ని బిల్లులోనే గ్యాస్ సిలిండర్ రవాణా చార్జి కింద చూపించాలన్నారు.ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ వారు వారి వారి కంపెనీల నుండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని సిలిండర్ ఖరీదు, సిలిండర్ రవాణాకు సంబంధించిన రుసుమును బిల్లులోని వినియోగదారులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సాఫ్ట్వేర్ గురించి వివిధ కంపెనీల వారిచే ఏజెన్సీ వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి kvsm ప్రసాద్  కర్నూలు సహాయ పౌర సరఫరాల అధికారి రామాంజనేయరెడ్డి, గూడూరు csdt నవీన్ ,ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లాలోని ఎల్పిజి గ్యాస్ కు సంబంధించిన ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.

About Author