NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ద్దతివ్వడ‌మా.. రాష్ట్రం వ‌దిలివెళ్లడ‌మా.. జ‌గ‌న్ తేల్చుకోవాలి !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్రకు మ‌ద్దతివ్వడమా ? లేదా రాష్ట్రాన్ని వ‌దిలివెళ్లడ‌మో సీఎం జ‌గ‌న్ తేల్చుకోవాల‌ని టీడీపీ నేత జీవి ఆంజ‌నేయులు అన్నారు. మ‌హాపాద‌యాత్రకు అద్భుత‌మైన మ‌ద్దతు వ‌స్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ క‌ళ్లల్లో కారంప‌డిన‌ట్టు అయింద‌న్నారు. మ‌హాపాద‌యాత్ర రోజురోజుకీ ఉద్యమంలా మారింద‌ని, రైతులు, ప్రజ‌లు బ్రహ్మర‌థం ప‌డుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. 700 రోజులు సాగిన అమ‌రావ‌తి ఉద్యమం కంటే 7 రోజుల పాద‌యాత్రకే ఎక్కువ మ‌ద్దతు వ‌స్తోంద‌ని అన్నారు. మ‌హాపాదయాత్ర ఇలాగే కొన‌సాగితే వైకాపా ప్రభుత్వం కూలిపోతుంద‌న్న విష‌యం జ‌గ‌న్ కు అర్థమైంద‌న్నారు. అందుకే పోలీసుల‌తో పాద‌యాత్రను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని అన్నారు.

About Author