PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాగౌరి అమ్మవారికి..ప్రాత:కాల పూజలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘమాసం సందర్భంగా శ్రీ మహా గౌరీ అమ్మవారికి రాజశ్యామల నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శ్రీ మహా గౌరీ అమ్మవారికి ప్రాతఃకాలంలో విశేష అభిషేకము, అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. మండపారాధనము, శ్రీ దేవి ఖడ్గమాల లలితా సహస్రనామ అర్చనలు సామూహిక కుంకుమార్చనలు జరిగినవి. సాయంత్రం అమ్మవారికి ప్రదోష కాలార్చన శ్రీ రాజశ్యామల సహస్రనామార్చన, లలిత అష్టోత్తర పూజలు జరిగినవి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు శ్రీ సూర్య దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి తెలిపారు.

About Author