PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముంబైలో…‘మలబార్​ నేషనల్​ హబ్​’

1 min read

ప్రారంభించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్​

 పల్లెవెలుగు, ముంబై: ప్రపంచంలోని 11 దేశాలలో 330కి పైగా షోరూములున్న ‘మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​’ సంస్థ… ఇండియన్​ ఆపరేషన్​ కోసం ముంబైలో ‘మలబార్​ నేషనల్​ హబ్​’ సెంట్రలైజ్డ్​ బేస్​ను ప్రారంభించడం సంతోషకరమన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్​. శనివారం మలబార్​ గ్రూప్ చైర్మన్ M.P అహమమ ద్; మాజీ పార్లమెంట్​ సభ్యులు మరియు లోక్‌మత్ మీడియా గ్రూప్​ చైర్మన్​  విజయ్​ దర్దా,  మలబార్ గ్రూప్​ వైస్  చైర్మన్​  K.P అబ్దుల్​ సలాం,  మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇండియా  ఆపరేషన్స్​  MD   అషర్​ ఓ,  గ్రూప్​ ఎగ్జిక్యూటివ్ ​డైరెక్టర్లు ఎకే నిషా, కెపి వీరంకుట్టిఇ,  మాయింకుట్టి, అబ్దుల్​ మజీద్​,  ఫైసల్​, అబ్దుల్లా,  వెస్ట్​ రీజినల్​ హెడ ఫన్జీమ్​ అహ్మద్​ తదితర ప్రముఖుల సమక్షంలో ‘మలబార్​ నేషనల్​ హబ్​’ సెంట్రలైజ్డ్​ బేస్​ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్​ ప్రాంభించారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన జ్యువెలరీస్​లో మలబార్ సంస్థ 6వ అతి పెద్ద జ్యువెలర్స్ రిటైల్​గా పేరుగాంచడం అభిననందనీయమన్నారు. అనంతరం  మలబార్ గ్రూప్​ చైర్మన్​ ఎం.పి. అహమ్మద్​ మాట్లాడుతూ “30 ఏళ్ల మా అద్భుతమైన ప్రస్థానపు వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో మలబార్ నేషనల్​ హబ్​ ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.  దేశంలో ప్రసిద్ధి చెందిన ఆభరణాలనైపుణ్యాన్నిదేశీయ మరియు ప్రపంచ మార్కెట్లలో వ్యాప్తి  చేయడంలో ఎం–ఎన్​హెచ్​ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  భారతదేశంలో మా సంస్థ అభివృద్ధిని వ్యూహాత్మంగా ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

About Author