PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మార్టిన్ లూథర్ కింగ్ ‘చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలి

1 min read

– తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్​ :  పూజా కొల్లూరు డైరెక్షన్ లో ఎస్ .శశికాంత్ ,చక్రవర్తి రామచంద్ర లు ప్రొడ్యూసర్లుగా, నటుడు వెంకటేష్ మహా కో- ప్రొడ్యూసర్ గా  ప్రముఖ కామెడీ కింగ్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఈనెల 27న తెరపైకి రానున్న సందేశాత్మక చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్ ‘ చిత్రం జ్యోతి మాల్ ఐనాక్స్ లో జరిగిన ప్రీమియర్ షో కార్యక్రమానికి వచ్చిన  హీరో సంపూర్ణేష్ బాబు, డైరెక్టర్ పూజ కొల్లూరు ,కో ప్రొడ్యూసర్ వెంకటేష్ మహాలను తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన కథానాయకుడు సంపూర్ణేష్ బాబు ఆదర్శవంతమైన ప్రజలకు అవసరమైన కథతో కూడిన సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలన్నారు. తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటు హక్కుకి ఉండే ప్రాధాన్యతను తెలియజేస్తూ  సామాన్య మానవుడి హక్కులను కాపాడే రాజకీయ వ్యవస్థ కావాలనే సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా  చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు.

About Author