PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పతకాలే.. లక్ష్యం…

1 min read

రింగ్​లోకి దిగితే…పతకాల పంటే…

  • విద్యార్థులను కిక్​ బాక్సర్లగా  తీర్చిదిద్దుతున్న ‘త్రినాథ్​’
  •  క్రీడల్లో 500 మందికి పైగా శిక్షణ ఇప్పిస్తున్న వైనం..
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు..
  • క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న క్రీడాభిమాని…
  • త్రినాథ్ కిక్​ బాక్సింగ్​ అకాడమి చైర్మన్​, అమ్మ, ఆర్క్​ హాస్పిటల్ అధినేత డా. త్రినాథ్​

దేశానికి బలమైన యువకులను అందించాలన్న సదుద్దేశంతో… విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా తన వంతు ప్రయత్నం చేయడంలో సఫలమయ్యారు ఓ వైద్యుడు. సమాజ శ్రేయస్సు కోసం… పిల్లల్లో సత్ర్పవర్తన… క్రమశిక్షణ తోపాటు తల్లిదండ్రులు…గురువుల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు పెంపొందించేలా కృషి చేస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా విద్యార్థులకు ‘కిక్​ బాక్సింగ్​’లో ఉచిత శిక్షణ  ఇప్పిస్తున్నారు… రాష్ట్ర స్థాయిలో ఇటీవల గుర్తింపు పొందిన కిక్​ బాక్సింగ్​ ను నేర్చుకునేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకుగాను ఎందరికో ఆదర్శం…మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు అమ్మ హాస్పిటల్​, ఆర్క్ హాస్పిటల్​ అధినేత డాక్టర్​ త్రినాథ్​.

కర్నూలు, పల్లెవెలుగు: రెక్కాడితే కానీ…డొక్కాడని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన చాలా మంది విద్యార్థులకు కిక్​ బాక్సింగ్​లో నైపుణ్య శిక్షణ ఇప్పించి… క్రీడా ఆంధ్రాకు మణిమాణిక్యాలుగా తీర్చిదిద్దేందుకు త్రినాథ్​ కోచింగ్​ సెంటర్ నిర్వాహకులు, అమ్మ, ఆర్క్​ హాస్పిటల్​ అధినేత డా. త్రినాథ్​ విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం త్రినాథ్​ కోచింగ్​ సెంటర్​లో శిక్షణ తీసుకున్న క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ… అవార్డులు, ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల ఖేలో ఇండియాలో సౌత్​ జోన్​ తరుపున కర్నూలు త్రినాథ్​ కోచింగ్​ సెంటర్​ అకాడమి నుంచి 90 మంది బరిలోకి దిగి… పతకాలు సాధించారు.

క్రీడల్లో..నైపుణ్యం..

కర్నూలు నగరంలోని డాక్టర్స్​ కాలనీలో త్రినాథ్​ కోచింగ్​ సెంటర్ ను నిర్వాహకులు త్రినాథ్​ నేతృత్వంలో కిక్​ బాక్సింగ్​ రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శి నాగేంద్ర  కిక్​ బాక్సింగ్​లో శిక్షణ ఇస్తున్నారు. కిక్ బాక్సింగ్​లోనే టటామి (పాయింట్​ ఫైట్​, కిక్​ లైట్​, లైట్​ కంటల్ట్​), రింగ్​  ఈవెంట్స్​ ( లో కిక్​, కె, ఫుల్​ కంటల్డ్​), మ్యూజికల ఫార్మ్స్​లో (కర్రసాము, ఉన్​ ఫా, నాన్​ చెక్​, సాయి, కత్తి, కమ, సివేఆన్​, ట్రబుల్​ నన్​ చెక్​)లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకుగాను కొందరు విద్యార్థులతో ఫీజు కొద్దిగా వసూలు చేయగా…. పేద విద్యార్థులకు మాత్రం ఉచిత కోచింగ్​ ఇస్తున్నారు.

రింగ్​లోకి దిగితే…. పతకాల పంటే…

 ఇక్కడ కిక్​ బాక్సింగ్​లో శిక్షణ తీసుకున్న క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు… ఇదే చివరి ఆట అనుకుంటూనే…. పతకాలను కైవసం చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు.  ఎనిమిదేళ్ల విద్యార్థి నుంచి 25 ఏళ్ల యువతీయువకులకు కిక్​ బాక్సింగ్​లో శిక్షణ పొందుతున్నారు. అటు చదువులోనూ….ఇటు క్రీడల్లోనూ … రాణిస్తున్నారు.

సాధించిన విజయాలు… మచ్చుకు కొన్ని…

2022 లో ఓపెన్​ ఇంటర్నేషనల్​ కిక్​ బాక్సింగ్​ టోర్నమెంట్​లో  త్రినాథ్​ కిక్ బాక్సింగ్​ అకాడమి నుంచి  ముగ్గురు విద్యార్థులు బరిలోకి దిగగా… ఇద్దరు పతకాలు సాధించారు. సీనియర్​ విభాగంలో సందీప్​ రెడ్డి (18) సిల్వర్​ మెడల్​ దక్కించుకోగా…. గద్దల అభి (12) చిల్డ్రన్స్​ విభాగంలో బ్రౌంజ్​ మెడల్​ దక్కించుకున్నాడు.

ఝార్ఱాండ్​ (రాంచి…)లో..

2023 ఆగస్టు 23 నుంచి 27వ తేదీ వరకు జరిగిన  చిల్డ్రన్స్​ నేషనల్​ లెవల్​ కిక్​ బాక్సింగ్​ ఛాంపియన్​ షిప్​లో ఆరుగురు  క్రీడాకారులు బరిలోకి దిగగా… ముగ్గురు పతకాలు కైవసం చేసుకున్నారు.  పాయింట్​ ఫైట్​ లో లిఖిత అనే క్రీడాకారిణి సిల్వర్ మెడల్​ దక్కించుకుంది.  అదేవిధంగా సత్య వైభవ్​ సిల్వర్​ , గద్దెల అభి గోల్డ్ మెడల్​ సాధించారు.

న్యూఢిల్లీలో…

2024 ఫిబ్రవరిలో వాకో ఇండియా ఓపెన్​ ఇంటర్నేషనల్​ కిక్​ బాక్సింగ్​ టోర్నమెంట్​ న్యూ ఢిల్లీలో జరిగిది.  అందులో గుర్రం హరి కళ్యాన్​  ‘లో కిక్​ ’ ఈవెంట్ ​లో గోల్డ్ మెడల్ సాధించగా…. జశ్వంత్​ రెడ్డి పాయింట్​ ఫైట్​లో బ్రౌన్జ్​ మెడల్​ కైవసం చేసుకున్నాడు.

ఖోలే ఇండియాలో…

 ఈ ఏడాది జనవరిలో  ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడల్లో సౌత్​ జోన్​ తరుపున ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల  నుంచి  దాదాపు 192 మంది క్రీడాకారులు బరిలోకి దిగగా… అందుల త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమి నుంచి 90 మంది  ఉన్నారు. అందులో  త్రినాథ్​ అకాడమికి చెందిన క్రీడాకారులు 40 దాకా బంగారు, వెండి, కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు.  మాంటీశ్వరి, ఎడిఫై, ఏ క్యాంప్​ మాంటేశ్వరి, విజిడమ్​ విద్యార్థులతోపాటు అకాడమి నుంచి కూడా  పతకాలు సాధించిన వారిలో ఉన్నారు.

 

About Author