PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల విధులపై బీఎల్ఓ లతో సమావేశం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీఎల్ఓ  సెక్టోరల్ ఆఫీసర్ల విధివిధానాలపై సోమవారం నాడు గడివేముల ఏఈఆర్ఓ గురునాథం ఎంపీడీవో శివరామిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ బూత్లలో మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించాలని ఎటువంటి సమస్య లేకుండా చూడాలని ఫారం సిక్స్ ఫారం సెవెన్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలన్నారు పత్రికల్లో వచ్చే కథనాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ఈ వీ ఏం .వి వి ప్యాట్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో సెక్టోరల్ ఆఫీసర్లు హేమ సుందర్ రెడ్డి పవన్ కుమార్. రెవిన్యూ సిబ్బంది వీఆర్వోలు జి ఎం ఎస్ కే సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .

About Author