PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోహ‌న్ బాబు, మంచువిష్ణుల‌ను అరెస్టు చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీనటులు మంచు మోహన్‌బాబు, విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సంఘం అధ్యక్షుడు మానుకొండ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో రాజోలు తహసీల్దార్‌ ముక్తేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా..దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెంది న ఉప్పాలపు నాగశ్రీను జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లి.. సినీ నటుడు మోహన్‌బాబు వద్ద హెయిర్‌ డ్రెస్సర్‌గా పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని తెలిపారు. అతన్ని మోహన్‌బాబు కులంపేరుతో దూషించి, దొంగతనం కేసు పెట్టారని, దొంగతనం నిజమో కాదో తక్షణమే ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

                                  

About Author