PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మసీదులు, మదర్శాలు, దర్గాలను రినోవేషన్‌చేయాలి

1 min read

– జమీల్‌ అహ్మద్‌ బేగ్‌
పల్లెవెలుగు వెబ్ గుంటూరు : ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎం. జియావుద్దీన్‌ను నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ ఆయనకార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది. త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభంకానున్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదులు, మదర్శాలు, దర్గాలు మరియు ఖబరస్తాన్‌లకు మరమ్మతులు చేసి రినోవేషన్‌ చేయవలసినదిగా కోరడమైనది. నమాజ్‌ వేళలలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మరియు సంస్థలలో పని చేసే కార్మికులకు నమాజు వేళలలో వారికి పర్మిషన్‌ ఇప్పించవలసినదిగా కోరడమైనది. ఈ రంజాన్‌ మాసంలో నిరంతరాయంగా కరెంటు మరియు నీటి సమస్య లేకుండా సరఫరాలో అంతరాయం లేకుండా చూడవలసినదిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముస్లింల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూడవలసినదిగా కోరినట్లు జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ ఒక ప్రకటనలోతెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్‌ సీఎం జగన్‌మోహనరెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సదరు సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పోస్టుద్వారా కూడా వినతి పత్రం పంపినట్లు జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author