PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడలో …కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  టూరిజం ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో డిసెంబరు 10,11,12 తేదీల్లో విజయవాడలో జరగబోవు కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముందస్తు కార్యక్రమాలుగా రాష్ట్రంలో ఆరు (6) విశిష్టమైన ప్రదేశాలలో తేదీ:27-11-2023 సాయింత్రం గం.4.00ల నుండి గం.6.30ని.ల వరకు నిర్వహించడం జరుగుతుంది.  రాష్ట్రంలోని బొబ్బిలి, రాజమహేంద్రవరం, లేపాక్షి, మువ్వ, నెల్లూరు, కర్నూల్ లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.  శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం, రాజమహేంద్రవరం, నందు డాక్టర్ మండా అనంత కృష్ణ (తిరుపతి) వేణుగాన కచేరీ నిర్వహించడం జరుగుతుంది, శ్రీ పెరవలి జయభాస్కర్ (హైదరాబాద్) – మృదంగం పై, శ్రీ పెరవలి నందకుమార్ (గుంటూరు) – వయోలిన్ పై, శ్రీ ఎం. హరిబాబు (గుంటూరు) – ఘటం పై హకరిస్తారు.  ఈ కార్యక్రమం జిల్లా యంత్రాంగం వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.

About Author