NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

1 min read

కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళం లో కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ, రైతులు మహిళలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పాదయాత్రలో తెలుసుకొని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముందుండి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు నారా లోకేష్ బాబు అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు జీవితంలో నారా లోకేష్ బాబు ఆరోగ్యంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని నారా లోకేష్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప దని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, నీలకంఠ రెడ్డి, వెంకటరెడ్డి ,రమేష్ గౌడ్, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు,కావలి ఈరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author