PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశ్వన్ కుమార్ గుప్తా కు జాతీయ సేవా పురస్కారం

1 min read

– డా.ఆకుమళ్ళ నాని చేతులు మీదగా డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం అందుకొవడం నా జన్మధన్యం ఘంటసాల అశ్వన్ కుమార్ గుప్తా

పల్లెవెలుగు వెబ్  విశాఖపట్నం: జీ.వి.కే.కాలేజీ ఎదురుగా జిల్లా పౌర గ్రంధాలయం ఏ.సి.ఆడిటోరియంలో శ్రీదాసరినారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖరత్న కళా పరిషత్ (రి)సంయక్త చైర్మన్ ఫౌండేర్ పి.ఎ.భాస్కర్ నిర్వాహణలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారాలు,మరియూడా.దాసరినారాయణరావ్ సేవా పురస్కారాలునిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి  ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు మరియూవై.యస్.ఆర్.సి.పి నాయకులు డా. ఆకుమళ్ళ. నాని మరి కొందరు ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథి పాల్గొని అన్ని రంగాల్లో స్వచ్ఛంద సేవా చేసిన వారిని కొంత మందిని మాత్రమే సెలక్ట్ చేసి ఈ పురష్కారం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కేవలం అతి కొద్దిమంది కీ ప్రాముఖ్యత్య కల్పించి వారికి ఈ పురస్కారాలు డా.ఆకుమళ్ళ. నాని మరియూ కొంత మంది ప్రముఖులు చేతులుతో అందించడంజరిగింది,అందులొముందుగా ,కృష్ణాజిల్లా,అవనిగడ్డ వాసి.తూర్పు గోదావరి జిల్లా నాని సేవాదళ్ అధ్యక్షులు అశ్వన్ కుమార్ గుప్తా గత రెండు సంవత్సరాలగా చేస్తున్న అనేక సేవల్ని గుర్తించి ఈ రోజు విశాఖ జిల్లాలోడా.బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవాపురస్కారం ముఖ్య అతిథి గా వరల్డ్ రికార్డ్స్ హోల్డర్,ఆంధ్ర సోనూ సూద్,ఉభయ రాష్ట్రాలయం.బి.సి.గౌరవ అధ్యక్షులు డా.ఆకుమళ్ళ.నాని మరికొంత మంది ప్రముఖులు పాల్గొని అవార్డు అందచేశారు . తదనంతరం ఘంటసాల అశ్వన్ కుమార్ గుప్తా మాట్లాడుతుముందుగా డా. బి.అర్.అంబేద్కర్ జాతీయసేవాపురస్కారం,డా.ఆకుమళ్ళ నాని కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాని సేవా దళ్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి మాకు ఇంతటి మహత్తర గుర్తింపు కల్పించిన నాని కి జన్మతః రుణ పడి ఉంటాను అధికూడాడా. బి.అర్.అంబేద్కకర్  దేశ బడుగు వర్గాల అరాధ్య దైవం, రాజ్యాంగ నిర్మాత ప్రతీ పేద వాడు చట్ట సభల్లో ప్రాముఖ్యత కల్పించడం వలనే ఇవ్వాల చట్ట సభల్లో అడుగు పెట్టారంటే అది కేవలం డా. బి.అర్.అంబేద్కకర్ నిర్మించిన రాజ్యాంగ వలనే అటువంటి మహోన్నత వ్యక్తి కీ ముందుగా నా హృదపూర్వక ధన్యవాదములు సమస్త దేశ ప్రజలందరూ గుండెల్లో చిరస్తాయి నిలిచిపోయి చెరగని ముద్ర వేసుకొన్న ఒకే ఒక్కరు మహోన్నత మైన వ్యక్తి  డా.బి.అర్.అంబేద్కర్ గారు మాత్రమే,అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి పేరు మీద నేను డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం ఏంతో మంది ప్రముఖుల మరియూ డా. ఆకుమళ్ళ.నాని చేతుల మీదుగా అందుకోవడం నా జన్మ సుకృతం అయింది ఈరోజు ఏంతో గర్వంగాను ఎనలేని సంతోషంగా ఉంది, విశాఖ రత్న పి.ఏ.బాస్కర్,నాని కి హృదయపూర్వక క్రుతజ్ఞతలు తెలియ జెస్తూన్నాను ఈ కార్యక్రమంలో,మాజీ కార్పొరేటర్ సాంబశివరావు,జాతీయ అధ్యక్షులు చింతాడ.సూర్యం ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author