PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ రాజకీయ ఆణిముత్యం నీలం సంజీవరెడ్డి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  కే బాబురావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి ని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  అభిప్రాయపడ్డారు. ఆదివారం స్వర్గీయ శ్రీ నీలం సంజీవరెడ్డి  111వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు రావు  మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవరెడ్డి గారు భారత ఆరవ రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, లోక్ సభ స్పీకర్ గా పనిచేశారని నేటి రాజకీయాలలో ఒకసారి ఎమ్మెల్యే అయితే కోట్లకు పడగలు ఎత్తుతూ రాజకీయ వారసత్వాన్ని పోషిస్తున్న తరుణంలో హంగు, ఆర్భాటాలు లేని నిస్వార్ధ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవరెడ్డి గారని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో ఆయన వద్దకు వచ్చాడని సంజీవరెడ్డి గారి ఆప్త మిత్రుడి వద్ద నుండి తెచ్చిన ఉత్తరం అది.. దాన్ని అతను అందుకున్నాడు కానీ చించి చూడలేదు.. కాంట్రాక్టర్ తో ఇలా అన్నాడు నువ్వు కాంట్రాక్టర్ వని నాకు తెలుసు దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు.. నీ క్షేమం కోరుకునే వాడివైతే ఈ ఉత్తరం వెనక్కి తీసుకో.. లేదు దీన్ని తెరిచి చూడమంటావా.. “ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు” అని అన్నాడు. మరో మాట మాట్లాడకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడు ఆ కాంట్రాక్టర్. నీలం సంజీవరెడ్డి గారి నిజాయితీ ఎలాంటిదో ఈ సంఘటనతో అర్థం అవుతుందని అలాగే నీలం సంజీవరెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని శ్రీశైలం ప్రాజెక్టుకు ఆయన మరణానంతరం నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేశారని ఆయన సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో నీలం సంజీవరెడ్డి గారి చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొరియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం డిసిసి ప్రధాన కార్యదర్శులు సయ్యద్ నవీద్, కే సత్యనారాయణ గుప్త జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఈ లాజరస్ ఓబీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకటరాముడు, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ కోసిగి జిలాని, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి పాషా, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ షేక్ మాలిక్ డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం అబ్దుల్ హై ఐ ఎన్ టి యు సి ప్రతాప్ ఓబిసి సెల్ రవికుమార్, రంగస్వామి మహిళా కాంగ్రెస్ నాగమ్మ మొదలగువారు పాల్గొన్నారు.

About Author