PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిస్సి ఇవాళ ఓ సెలబ్రెటీ…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవును నిజంగానే తనను సెబ్రెటీగా మాట్లాడుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్లందరూ, తానే కాదు నిస్సీ తల్లిదండ్రులు కూడా సెలబ్రెటీలే.

మీరు చదివింది నిజమే

ఆడపిల్ల పుడితే అరిష్టం అన్న రోజుల నుంచి ఆడపిల్లను ఒక మైనస్ గా చూసిన సమాజాన్ని సైతం చూశాం మనం. కాలం మారింది, ఆడ మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివాలనే సంకల్పం మొదలైంది దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో సైతం. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సి… ఆడపిల్లను పక్కూరికి ఒంటరిగా చదువుకోసం పంపడానికి భయపడే  ఈ రోజుల్లో… విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రోత్సహించచిన తల్లిదండ్రులు, అందుకు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని అందించిన బొల్లినేని మెడిస్కిల్స్ యాజమాన్యం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ తెనాలి నుండి లండన్ వరకూ ప్రయాణం సాగించేందుకు వారధిగా నిలిచిన బొల్లినేని మెడిస్కిల్స్ ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా అభినందించి తీరాల్సిందే.

నిస్సి జీవితాన వెలుగు రేఖ

చదివింది డిగ్రీ…. కొలువు లండన్ లో

వార్షిక వేతనం అక్షరాల రూ 37 లక్షలు

బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థిని ప్రతిభ

యూకేలో ఉద్యోగానికి ఎంపిక

వాళ్లబ్బాయి సాప్ట్ వేర్ అంట, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంటా.. అనే మాటను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. జీతం చాలా ఉంటుందిగా అని అవతి వ్యక్తి నుండి మళ్లీ ప్రశ్న. ఇలాంటి మాటలు చుట్టు పక్కల ఇళ్లలో అడపాదడపా ఎదురయ్యే ఉంటాయి. అయితే దేశంలో కొన్ని వృత్తులు చేపట్టేవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజ్, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. కొంత మంది ఎంపిక చేసిన వారికి మాత్రమూ చాలా ఎక్కువ జీతాలు చెల్లించే కార్పొరేట్, పీఎస్ యూ సంస్థలు ఉన్నాయి. అలా కాకుండా సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా బొల్లినేని మెడిస్కిల్స్ లో బిఎస్సీ కార్డియాలజీ పూర్తిచేసిన నన్నం నిస్సీ లియాన్ అనే విద్యార్థిని రూ 37 లక్షల వార్షిక వేతనంతో బ్రిటన్ లో ఓ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. అందులో బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థిని నిస్సీ లియాన్ ఒకరు కావడం విశేషం.

మంచి కొలువు సాధించి..

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ బొల్లినేని మెడిస్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలో బీఎస్సీ కార్డియాలజీ పూర్తి చేసింది. ఇటీవల యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన అత్యతున్నత ఆస్పత్రిలో ఉద్యోగానికి ఎంపికైనది. ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులకు, నైపుణ్యం కలిగిన వారిని సదురు సంస్థ ఎంపిక చేస్తుంది. అందులో భాంగా ఇండియా నుండి ఇద్దరు ఎంపిక కాగా అందులో బొల్లినేని మెడిస్కిల్స్ కు చెందిన నిస్సీ లియోన్ కూడా ఎంపికైంది. అయితే ఇది అంత ఆషామాషీగా జరగలేదు. దీని వెనుక కఠోర శ్రమ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పేరుమోసిన స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.సాధారణ కుటుంబండాక్టర్ కావాలన్ని పట్టదల ఉన్నా…. మద్యతరగతి కుటుంబం కావడంతో బిఎస్సీ పారా మెడికల్ డిగ్రీ కార్డియాలజీ విభాగంలో చేరారు. కిమ్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ డా. భాస్కర్ రావు, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ నాగేశ్వరరావు, అక్కడమిక్ డైరెక్టర్ పద్మజ, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించినట్టు నిస్సీ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *