PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు టి.జి భ‌ర‌త్ నామినేష‌న్

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా గురువారం టి.జి భ‌ర‌త్ నామినేష‌న్ వేయ‌నున్నారు. ఉద‌యం 8:30 గంట‌ల‌కు పెద్ద మార్కెట్ వ‌ద్ద నుండి భారీగా ర్యాలీ చేప‌ట్టనున్నట్లు ఆయ‌న‌ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈ ర్యాలీ పెద్ద మార్కెట్, అంబేద్కర్ స‌ర్కిల్, జిల్లా కోర్టు, కొత్తపేట నాలుగు రోడ్లు, శ్రీల‌క్ష్మీ స్కూల్ మీదుగా మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ర‌కు సాగుతుంద‌ని పేర్కొన్నారు. తెదేపా, జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణులు, టి.జి అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చి కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఆయ‌న కోరారు.

About Author