PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్నీలపై..అవగాహన అవసరం..

1 min read
  • వ్యాయామం తప్పనిసరి..
  • శాఖాహారం తీసుకోండి.. మాంసాహారంతో కిడ్నీకి హానీ
  • అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, నెఫ్రాలజి వైద్య నిపుణులు డా.వి. వెంకట రంగారెడ్డి
  • పల్లెవెలుగు, కర్నూలు: మూత్రపిండాల పనితీరుపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లేకపోతే ఆరోగ్యపరంగా నష్టపోతారన్నారు అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి. గురువారం ప్రపంచ కిడ్నీ డే ను పురస్కరించుకుని నగరంలోని జీజీహెచ్​ ఆస్పత్రి నుంచి రాజ్​ విహార్​ సెంటర్​ మరియు కలెక్టరేట్​ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్డా.V.వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ కిడ్నీ డే (WKD) (ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం) ను  పురస్కరించుకొని కిడ్నీల ఆరోగ్యంపై కిడ్నీ రన్ ను వైద్యులు మరియు నర్సింగ్ విద్యార్థులు కలసి ఆసుపత్రి ఆవరణ నుండి రాజ్ విహార్ సెంటర్ మరియు కలెక్టరేట్ వరకు అవగాహన కార్యక్రమన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సంద‌ర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు జి జి హెచ్ & కే ఎం సి నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ  ఆధ్వర్యంలో న‌గ‌రంలో గురువారం ఉద‌యం కిడ్నీ ర‌న్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) గురించి అవగాహన పెంచడానికి, ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఈ స‌మ‌స్యను ఎదుర్కోవ‌డండ‌లో ప్రజ‌లంద‌రి భాగ‌స్వామ్యన్ని పెంచ‌డానికి ఇదో మంచి ముంద‌డుగ‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు.  కిడ్నీ అనేది మన అవయవాలలో ముఖ్య భాగమని శరీరంలో ఎటువంటి చెడు పదార్థాలైన బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కిడ్నీ అనేది ముఖ్యంగా మూడు జబ్బులకు ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది మొదటిది హైపోటెన్షన్, 2.డయాబెటిస్ 3.ఒబేసిటీ.  ఈ వ్యాధిని నిరోధించడానికి రెగ్యులర్గా బీపీ కంట్రోల్ చేయడానికి మరియు స్థూలకాయం అదుపులో ఉండడానికి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని  అన్నారు. కిడ్నీ సంబంధించిన డైట్ ప్రతి ఒక్కరు అనుసరించాలని తెలిపారు. ఈరోజు మన స్లోగన్  “ఉప్పు వద్దు పప్పు ముద్దు ” పప్పు అంటే పల్సస్ చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అవి  కిడ్నీలకు చాలా  మేలు చేస్తాయని అన్నారు. అనంతరం ప్రతి ఒక్కరు వెజిటేబుల్ ఫుడ్ ను తీసుకోవాలని తెలిపారు. నాన్ వెజిటేబుల్ ఫుడ్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి అందులో ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలకు హాని చేస్తాయని అన్నారు. మంచి ఆరోగ్యనికై  ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి మంచి ఆహారము మరియు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి  నెఫ్రాల‌జిస్టు విభాగపు వైద్యులు  డా.జిక్కి, డా.ఆనంత్, డా.వెంకటపక్కి రెడ్డి, డా.శ్రీధర్ శర్మ, యూరాలజీ హెచ్ఓడి, డా.సీతారామయ్య,  RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్,   నర్సింగ్ సూపరింటెండెంట్ G1, శ్రీమతి.వెంకతులసమ్మ, వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి తెలిపారు.

About Author