PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7వ రోజు అంగరంగ వైభవంగా అచ్చమ్మ పేరంటాలు..

1 min read

ఉత్సవాల్లో  పలు సాంస్కృత కార్యక్రమాలు నాటికలు..

భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గ మండలం గాలాయిగూడెంలో కోరైన కోరికలు తీర్చే కల్పవల్లిగా ,సంతాన లక్ష్మిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పేరు పొందిన గాలాయగూడెం గ్రామదేవత శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. వందలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం గాలాయగూడెం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు పిడుగు రాంబాబు (రాజమండ్రి ) సమర్పించు ముచ్చటైన మూడు రత్నాలు1 బాలనాగమ్మ పకీరు సంగు లవ్ సీను,2 వారణాసి సీను,3 చింతామణి (భవాని చింతామణి లవ్ సీను) ప్రదర్శించారు. పలు సాంస్కృతి కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తున్నారు. యువత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు చిన్నారులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంటున్నారు. దీంతోపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విద్యుత్ అలంకరణ ఉత్సవాలకు వచ్చేవారిని అమితంగా ఆకర్షించింది. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలు సుధీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాలాయిగూడెం ఉత్సవం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

About Author