PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీనియర్ అసిస్టెంట్ కు ఒక వార్షిక ఇంక్రిమెంట్ కట్

1 min read

పల్లెవెలుగు వెబ్  ఉయ్యూరు : ఉయ్యూరు నగర పంచాయతీ పూర్వపు సీనియర్ అసిస్టెంట్ కె. చిన్న కేశవరావుకు ఒక వార్షిక ఇంక్రిమెంట్ ను కట్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారని సామాజిక కార్యకర్తజపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ మేరకు జి.ఓ .ఆర్ .టి నెంబర్ 569 ప్రకారం  శ్రీమతి శ్రీలక్ష్మి  చేశారు. అనేక ఆర్థిక అవకతవకలు గురించి ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ,2020 లో రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది .కె. చిన్న కేశవరావు ఉయ్యూరు నగర పంచాయతీలో 2013 -2014 ,2015 -2015 లో ఇంటి పన్ను రిజిస్టర్లో సుమారు 70 ఇంటి పన్నులు యజమానుల పేర్లను ఉయ్యూరు నగర పంచాయతీ పాలకవర్గంతో సంబంధం లేకుండా పేర్లు మార్చి వేయడం జరిగింది. అప్పటి నగర పంచాయతీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు చెన్నకేశవరావును 2016లో సస్పెండ్ చేయడం జరిగింది. 2008 లో పశ్చిమగోదావరి జిల్లా ,తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఇంటి పన్నుల దుర్వినియోగం , చేయడం, మున్సిపాలిటీ రికార్డులను మాయం చేయడం ,తదితర ఆరోపణలపై 30 మంది మున్సిపల్ ఉద్యోగులు సస్పెండ్ కాగా, ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనులు నిర్వహిస్తున్న, కె. చెన్నకేశవరావు కూడా సస్పెండ్ కావడం జరిగింది .2008లోని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ లోని అవకతవకలపై డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి రిపోర్ట్ నెంబర్ 145 ప్రకారం కె. చెన్నకేశవరావు పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది,. గుంటూరు మున్సిపల్ శాఖ రీజినల్ డైరెక్టర్ వి. శ్రీనివాసరావును ఎంక్వయిరీ అధికారిగా ప్రభుత్వం నియమించింది . కె .చెన్నకేశవరావు పై ఆరోపణలు చేయబడ్డ 5 ఆరోపణలలో 2 ఆరోపణలు రుజువు కాబడినందున ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్స్ 1991( 2) ప్రకారం కె .చెన్నకేశవరావుకు 1యాన్యువల్ ఇంక్రిమెంట్ వితౌట్ .కు్మిలేటివ్ ఎఫెక్ట్ ను పెనాల్టీగా విధించడం అయినది అని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author