PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి కొడాలి నాని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రత

1 min read


పల్లెవెలుగు వెబ్: ఏపీ అసెంబ్లీ ఇటీవల జరిగిన పరిణామాలతో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను కల్పించింది ప్రభుత్వం. చంద్రబాబు అంశంపై అనంతరం సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. మంత్రి నానికి ఇప్పటికే 2 ప్లస్ 2 భద్రత ఉండగా అదనంగా 1 ప్లస్ 4 భద్రతతోపాటు కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కేటాయించారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అదనంగా 3+3 గన్‌మన్లతో భద్రత కల్పిస్తున్నారు.

About Author