PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైనా జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి నీటి levels 1,30,978 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 59,632 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి 882.60 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 204.78 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఇదే వరద ప్రవాహం కొనసాగితే ఈరోజు శ్రీశైలం జలా శయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి.

About Author