PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన దేశానికి ప్రాణశక్తి మన జీవన విధానం

1 min read

– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మన దేశానికి ప్రాణశక్తి మన జీవన విధానం. సత్యం, ధర్మం మూలస్థంభాలుగా ఉన్న మన భారతీయ జీవన విధానం మీదనే మనదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, మన ప్రాణ శక్తిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గడివేముల నందు వెలసిన శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాల అనంతరం  నిర్వహించిన  ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారకులు చెంచు రామ్మోహన్ రావు, ఎంపిటిసి మహేశ్వర రెడ్డి, అర్చకులు చెన్నకేశవయ్య, కృష్ణమూర్తి, ప్రధానాచార్యులు యం. రామేశ్వర రావు, డీలర్ శ్రీనివాసులు, భజన మండలి అధ్యక్షులు బాల వీరాంజనేయులు, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, భజన మండలి సభ్యులు ఈడిగ అచ్చెన్న, దేశం సంజీవరెడ్డి, దేశం నాగేశ్వర రెడ్డి, గాండ్ల నాగేశ్వరరావు, బిడుదూరి నాగేశ్వర రెడ్డి, దుబ్బా రామచంద్రారెడ్డి, దాశి నాగిరెడ్డి, షణ్ముఖసాయి, ఈపూరి లక్ష్మీనారాయణ, ఎన్. వెంకటేశ్వర్లుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author