PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశ్రీ విద్యా సేవలు మరువలేనివి        

1 min read

ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ 

 పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలకల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాద్యాయురాలు శ్రీమతి పద్మశ్రీ విద్యకు అందించిన సేవలు మరువలేనివని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ కొనియాడారు. శనివారం తెలుగు ఉపాధ్యాయిని శ్రీమతి పద్మశ్రీ  పదవీ విరమణ వీడ్కోలు సభ జరిగింది.ఈ సభ పాఠశాలప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పద్మశ్రీ దంపతులను ఉపాధ్యాయిని బృందం మరియు వివిధ తరగతి విద్యార్థినీలు శాలువాలతో,పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ, పద్మశ్రీ మేడం విద్యాసేవలు మరువలేనివనీ,  ఆమెకు వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అమోఘం, అపూర్వం అని అన్నారు.ఆమె ఎంతో మంది విద్యార్థులను తన ఉద్యోగ ప్రయాణంలో తీర్చి దిద్దారని తెలిపారు.పద్మశ్రీ  ఎందరో  ఉపాధ్యాయులకు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కొత్తపల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.

About Author