PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శేషయ్యను ఘనంగా సన్మానించిన చీమకుర్తి ’పద్మశాలి’

1 min read

పల్లెవెలుగు: నెల్లూరు జిల్లా చేనేత నాయకులు, పద్మశాలి కుల బాంధవులు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపన లో ముఖ్యలు, ఉపాధ్యాయులగా స్వచ్ఛంద పదవి విరమణ చేసి, చేనేత సమస్యలపై పోరాటం చేస్తున్న కె.వి శేషయ్యను  చీమకుర్తి పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.  అనంతరం  త్వరలో ప్రకాశం జిల్లాలో జరగనున్నసమావేశం గురించి పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఆయనతో చర్చించారు.  కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పద్మశాలి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు దొంతు సోమయ్య , ప్రకాశం జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు సోమా యానాది శెట్టి, ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దోమల పుల్లయ్య, ఆలిండియా   వీవర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గుద్దంటి శ్రీనివాసరావు,చీమకుర్తి మునిసిపాలిటీ కౌన్సిలర్లు సోమా శేషాద్రి  గోపురవు పూర్ణచంద్రరావు, చీమకుర్తి చేనేత సొసైటీ అధ్యక్షులు అవ్వారి ఆదినారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ప్రకాశం జిల్లా ప్రతినిధులు నూకల రాఘవ, భువనగిరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author