PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టుదలతో..సాధించండి..

1 min read

ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

  • GROUP II మెటీరియల్ అందజేత

కర్నూలు, పల్లెవెలుగు:పట్టుదల, కృషితో విద్యనభ్యసించి… ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​  అభ్యర్థులకు పిలుపునిచ్చారు.  బుధవారం  నగరంలోని ఓ కోచింగ్​ సెంటర్​లో CEDM  మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మైనారిటీ విద్యార్థులకు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ఉచితంగా GROUP II మెటీరియల్  అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఉద్యోగం సాధించాలన్నారు.  కార్యక్రమం లో RCEDM డైరెక్టర్ డా! యం.డీ మస్తాన్ వాలి ,డిప్యూటీ డైరెక్టర్ సయ్యద్ సామీఉద్దీన్ ముజామ్మిల్,RCEDM స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author