PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల

1 min read

పల్లెవెలుగువెబ్ : పోస్టల్ సర్కిల్ గతంలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఏపీ పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఆ ఫలితాలను ఏపీ పోస్టల్ GDS ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అధికారిక పోర్టల్ లో ఏపీ గ్రామీణ డాక్ సేవకుల మెరిట్ జాబితా పీడీఎఫ్ ను అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులు పేర్లను ఈ జాబితాలో పొందుపరిచారు. ఏపీలో మొత్తం 1716 పోస్టులు, తెలంగాణకు 1226 పోస్టులకు ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థులు ఫలితాల కోసం https://indiapostgdsonline.gov.in/లో చెక్‌ చేసుకోవచ్చు

About Author