PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాంతినగర్ 21వ డివిజన్ లో బడేటి ప్రజాసంకల్పయాత్ర..

1 min read

చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం

టిడిపి ప్రభుత్వానికి అందరి మద్దతు కావాలని విజ్ఞప్తి

బడేటి రాధాకృష్ణయ్య (చంటి) టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్‌ రెడ్డి భౌతికదాడులకు సిద్దమంటున్నారా అంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటివరకు తన అరాచక పాలనతో ప్రజల ఛీత్కారానికి లోనైన సైకో సీఎం ఇప్పుడు ఏకంగా భౌతికదాడులు చేయించే స్థితికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు. ఏలూరు 21వ డివిజన్‌ శాంతి నగర్‌ 14వ రోడ్డులో బుధవారం ఉదయం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బడేటి చంటి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్ళీ టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. భవిష్యత్తులో టిడిపి – జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవస్యకతను వివరించి, మద్దతు తెలపాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇప్పటికే సీఎం జగన్‌, వైసిపి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అయితే వారిని మరింత చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా కంఠకుడిగా మారిన జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దింపాలంటే అందరు సంఘటితంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైసిపి ఓటమి ఖరారు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న సైకో సీఎం పైకి సినిమా డైలాగ్‌లు చెబుతున్నా, లోనున్న ఆక్రోశంతో అందరిపై భౌతికదాడులకు ఉసిగొల్పుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడితే ఏం జరుగుతుందో అందరికి తెలుసునని, ప్రజా విప్లవం పెల్లుబికితే జగన్మోహన్‌ రెడ్డిలాంటి వ్యక్తులు కనుచూపుమేరలో కనిపించకుండా పోతారని హెచ్చరించారు. వైసిపిని తరమికొట్టేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని బడేటి చంటి ధీమా వ్యక్తం చేవారు. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వమ్యబద్దపాలన టిడిపి – జనసేన కూటమితోనే సాధ్యమని, ఈ విషయం ప్రజలు గుర్తించారని, రానున్న ఎన్నికల్లో ప్రజాతీర్పు కూటమి వైపే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ rnr నాగేశ్వరావు, డివిజన్ ఇంచార్జ్ అట్లూరి. రామక్రిష్ణ,కేతినేడి భాస్కర్రావు,కరల కిషోర్, Y.H.S.శ్రీనివాస్, వంకినేని బాబురావు,చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మలినేని బెనర్జీ, విరమచినేని పూర్ణచంద్ర, మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author