PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగు వెబ్ : సీమ ఎత్తిపోత‌ల‌కు అనుమ‌తి ఉంటే.. ప‌నులు ఆపాల‌ని కృష్ణా బోర్డు ఎందుకు ఆదేశించింద‌న్న తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నకు… ఏపీ ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డి స్పందించారు. ప్రాజెక్టుల విష‌యంలో కొంద‌రు తెలంగాణ నేత‌లు తెలుగు ప్రజ‌ల మ‌ధ్య విద్వేషాలు ర‌గ‌ల్చే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని స‌జ్జల విమ‌ర్శించారు. మాట్లాడితే స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌ని, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. సాగు నీటి విష‌యంలో ఇరు రాష్ట్రాలు స‌ర్దుకుపోవాల‌నే విధానంతో సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని, అందుకే సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. ప‌రుషంగా మాట్లాడ‌టం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని అన్నారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.

About Author