PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమీన్ భాయ్ కు ప్రతిష్టాత్మక “లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రతిష్టాత్మక ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ను అమీన్ భాయ్ అందుకున్నారు.సేవా కార్యక్రమాలకు  ఈ అరుదైన గౌరవం లభించింది.ఎ1 ఫౌండేషన్ చైర్మన్ & ఫౌండర్ అమీన్ భాయ్ గత కొన్ని సంవత్సరాలుగా  చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తించిన లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ వారు ఆయనకు ఈ అవార్డును అందించారు. అభాగ్యులకు, అనాథలకు అండగా ఉంటూ, నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ,కరోన సమయంలో కూడా బియ్యం బస్తాలను, గోధుమలు, పాలు పంపిణీ చేసిన వ్యక్తి అమీన్ భాయ్. ఆరోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చిన వారికి ఆర్థికంగా ఆదుకొన్నారు.ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది నిరుపేద కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు.గుళ్లు,  మసీదులు, చర్చిల, నిర్మాణానికి విరాళాలు అందించారు.మానవ హక్కుల సంఘం సభ్యుడుగా ఎంతో మంది బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేసారు.రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ,  మహిళలకు అన్న గా, వ్యాపార వేత్త గా ” ముస్లిం మైనార్టీ  రాష్ట్ర నాయకుడు గా ” హ్యూమన్ రైట్స్ సభ్యుడు గా ” రాజకీయ నాయకుడు గా,  ఆయన ప్రయాణం కొనసాగుతోంది.నేడు దేశ వ్యాప్తంగా సమాజ సేవ కోసం, అనాధలకు, అభాగ్యులకు, రోగులకు, మహిళలకు, కేన్సర్ వ్యాధి బాధితులకు, వృద్ధులకు, వికలాంగులకు, అనాధా పిల్లల చదువులకు, ఎయిడ్స్ బాధితులకు, అనాధాశ్రమలకు, వృద్ధ ఆశ్రమలకు, అండగా నిలబడుతున్నారు.A1 ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ధృడ సంకల్పంతో ఉన్నారు.ఈ మహా యాజ్ఞనికి మంచి మనస్సు గల మీ అందరు దాతలు గా’ వాలంటీర్ గా’ సభ్యులు గా” ప్రచార కర్తలు గా, సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అమీన్ భాయ్ మాట్లాడుతూ ‘ ఈ అవార్డు ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం అందించారని అన్నారు.సేవా కార్యక్రమాలు గుర్తించి   ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ అవార్డు గ్రహీత గా ఎన్నిక చేసిన కమిటీ సభ్యులు మరియు ఢిల్లీ పెద్దలకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

About Author