PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వయం సహాయక బృందాలకు హౌసింగ్ లోన్ సౌకర్యం కల్పించండి

1 min read

పరిశ్రమలకు కావలసిన భూములు త్వరగా కేటాయించే చర్యలు తీసుకోండి…

పోలింగ్ స్టేషన్లకు కావలసిన సదుపాయాలు వెంటనే కల్పించండి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ లతో వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల మీద సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గురువారం సాయంకాలం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో మరియు జాయింట్ కలెక్టర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి.మిస్సింగ్ అసైన్డ్ లాండ్స్ , డాటెడ్ లాండ్స్ , షరతులు గల పట్టా లాండ్స్ మీద సరైన చర్యలు తీసుకొని వాటిని ఫ్రీహోల్డ్ చేయవలసిందిగా , ఫేస్ -3 సర్వేలో స్టోన్ ప్లాంటేషన్ పనులు త్వరగా పూర్తి చేయించాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లను ఆదేశించారు.పరిశ్రమల కు కావలసిన  కావలసిన భూములను కేటాయించాలని  ఆదేశించారు.నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు త్వరగా పూర్తి అయ్యే చర్యలు చేపట్టాలని , స్వయం సహాయక బృందాలకు హౌసింగ్ లోన్లు ఇప్పించి స్టేజ్ కన్వర్షన్లు త్వరగా పూర్తి చేసే చర్యలు , ఆర్చ్ లు, ఆప్షన్ మూడులో జరుగుతున్న పనులు పర్యవేక్షించాలని , హౌసింగ్ లో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను ఐసిఐసిఐ బ్యాంకు వారికి ఇచ్చి లబ్ది దారులకు అకౌంట్లు ఓపెన్ చేయించాలని , బ్యాంక్ వారి ద్వారా లోన్లు ఇప్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించినారు.సాధారణ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసుకుంటున్న అన్ని పోలింగ్ స్టేషన్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు…టాయిలెట్లు, ర్యాంపులు, కరెంటు మొదలగు పనులు వెంటనే పూర్తి చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశము లో  క్యాంప్ కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .సృజన. కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య , జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి , హౌసింగ్ పీడీ సిద్దలింగమూర్తి , ఇండస్ట్రీస్ జెడ్ యమ్ సోమశేఖర్ రెడ్డి , సిపిఓ హిమ ప్రభాకర్ రాజు,డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ రామ గిడ్డయ్య , ఆరోగ్యశ్రీ , డిసిహెచ్ఓ ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్  అధికారులు  పాల్గొన్నారు.

About Author