PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమం, రాజన్న రాజ్యం షర్మిలమ్మతోనే సాధ్యం..!

1 min read

షర్మిలమ్మ రాకతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది..!

ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ..

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  ఈరోజు హొలగుంద మండల కేంద్రంలోని స్థానిక ఎల్. ఎల్. సి. గెస్ట్ హౌస్ నందు జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆలూరు ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీతోనే ఆలూరు అభివృద్ధి సాధ్యమని రాజన్న రాజ్యం షర్మిలమ్మతోనే సాధ్యం అవుతుందని, షర్మిలమ్మకు రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారని తన తండ్రి వైఎస్సార్ ఆశయ సాధనకు కంకణబద్దురాలై పని చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పోందుతుండడంతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, హోలగుంద మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం ప్రస్తుత ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి గుమ్మనుారు జయరాం  సోదరుడు నారాయణ స్వామి ఆస్పరి జడ్పీటీసీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన దొరబాబు ను ఫోన్లో నానా దూర్భాషలు మాట్లాడుతూ బెదిరింపులు గురి చేసిన నారాయణ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితేనే కేసులు పెడుతున్నారని కానీ ఏకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్న కేసులు నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హెబ్బటం గ్రామంలో గడ్డి వాములు దగ్ధమైన రైతులను ఆదుకోవాలని సుమారు 20 లక్షల వరకు నష్టం జరిగిన కనీసం తక్షణ సాయం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా నిలిచి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పశుగ్రాస రైతులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోలగుంద మండల కాంగ్రెస్ నాయకులు ఓబిసి నియోజకవర్గ అధ్యక్షులు మంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా, ఎస్సీ సెల్ తాలుకా అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, హెచ్. పరిశప్ప, మహేష్, సీనియర్ నాయకులు కరెంటు గోవిందు, వీరాంజినేయులు,  మార్లమడికి రంగన్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author