PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్య భర్తల మధ్య గొడవ.. భర్త మృతి

1 min read

పల్లెవెలుగు, గడివేముల: రోజు మద్యం తాగి భార్యను వేధిస్తూ సోమవారం రాత్రి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో అనుకోకుండా కిందపడి తలకు బలంగా బండ తగిలి భర్త మృతి చెందిన ఘటన మండల పరిధిలోని  కోర్రపోలురు గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు…గ్రామానికి చెందిన చాకలి లోకేశ్వరుడు గత ఐదు సంవత్సరాల నుండి మద్యానికి బానిసై భార్య పిల్లలను వేధించేవాడని గతంలో పెద్దలు కుటుంబ సభ్యులు తీరు మార్చుకోవాలని మందలించిన తీరుమారక అందరితో గొడవ పడుతూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని సోమవారం రాత్రి భార్య సుబ్బలక్ష్మమ్మ  పై దాడి చేసి కొట్టడంతో గొడవలో పెనుగులాట జరిగి కాలు జారీ తలకు బండ తగిలి తీవ్ర రక్తస్రావమై భర్త లోకేశ్వరుడు మృతి చెందినట్లు మృతుడి తండ్రి వంగాల చాకలి రాముడు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సిఐ వెంకటేశ్వరరావు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

About Author