PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్ర‌బాబుకు ర‌జ‌నీకాంత్ ఫోన్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబుకు అవ‌మానం జ‌రిగిన నేప‌థ్యంలో ప‌లువ‌ర్గాల నుంచి చంద్ర‌బాబుకు మ‌ద్దతు పెరుగుతోంది. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు, సౌత్ ఇండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన ప‌రిణామాల‌పై ర‌జినీకాంత్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు. ఏపీలో ప‌రిస్థితుల గురించి ర‌జినీకాంత్ చంద్ర‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి కుటుంబం మొత్తం చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌బ‌డింది. త‌మ కుటుంబ స‌భ్యుల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రించింది.

About Author