PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్లను ఇంటికెళ్లి పంపిణీ చేయాలని వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పింఛన్ల పంపిణీపై జగన్ సర్కార్ విష ప్రచారం చేస్తూ ఉందని టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి అన్నారు.ప్రతి నెలా అందజేసే పింఛన్లను లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగావతి కి మంగళవారం టిడిపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.తర్వాత టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో కాతా రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి మాట్లాడుతూ   ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్ల రూ.లు సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకి తెరలేపారని వారు మండిపడ్డారు.ఫించన్లు పంపిణీ చేయించక పోవడానికి నిధులు కొరతే కారణం గానీ తెలుదేశంపార్టీది కాదన్నారు. వారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి టిడిపి పార్టీపై రుద్దడం సిగ్గుచేటన్నారు.లక్ష 35 వేల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చని అన్నారు.కానీ పేదలపై అంత ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఏప్రియల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు.  సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో ఫించను పంపిణీ చేయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతలపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి,కడుమూరు సుధాకర్ రెడ్డి,రంగారెడ్డి,రమణారెడ్డి, కేశాలు,మునాఫ్,చాంద్ బాష,ఆదినారాయణ తదితరులు పాల్గొన్నవారు.

About Author