NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరగబడ్డ రైతులు.. సోలార్ ప్లాంట్ వద్దంటూ ఏకగ్రీవంగా గ్రామసభ తీర్మానం..

1 min read

పల్లెవెలుగు వెబ్  ఓర్వకల్ : ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గ్రామసభ గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అధ్యక్షతన జరిగింది ఈ సభకు గ్రామపంచాయతీ కార్యదర్శి సుమలత మరియు విఆర్ఓ మధుసూదన్ లు పాల్గొన్నారు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యదర్శి సుమలత ప్రారంభించగానే రైతులు గ్రామసభలో పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు సోలార్ ప్లాంట్  మాకు వద్దు ,మాకు వద్దు ,మా పొలాలను కాపాడండి మా పశువులను గొర్రెలను కాపాడండి, రైతులకు నష్టం కలిగజేసే సోలార్ ప్లాంటు మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేశారు  వెంటనే గ్రామ పంచాయితీ కార్యదర్శి సుమలత స్పందిస్తూ సోలార్ పవర్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన విజ్ఞప్తికి స్పందించి ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ అవసరం లేదని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు అజెండా చదివి వినిపించి సుమారు 400 మంది రైతులు గ్రామ ప్రజలతో సంతకాలను చేయించారు గ్రామసభలో పంచాయతీ సర్పంచ్ శకుంతలమ్మ మరియు ఎంపీటీసీ తదితరులు అందరూ సంతకాలు చేసి సోలార్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా తమ ఆమోదాన్ని తెలిపారు.

About Author