PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నం పరబ్రహ్మ స్వరూపం…

1 min read

ప్రతి వారం అభాగ్యులకు అన్నదానం

శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..

పల్లెవెలుగు  వెబ్ వల్లూరు: అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి అన్నారు, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం నా సంకల్పం అని ప్రతి వారం రోడ్ల పైన ఉన్న అభాగ్యులకు అన్నదానం చేస్తున్నామని అదేవిధంగా ఈ వారం కూడా అన్నదానం చేయడం జరిగిందన్నారు, అలాగే స్థానిక సూర్య రిపోర్టర్ కూతురి స్పందన ప్రియ పుట్టిన రోజు సందర్భంగా అభాగ్య మధ్యలో కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్నవారికి పంచడం జరిగింది, అలాగే అందరికీ అన్నదానం చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయి ఇంతకన్నా మానవత్వం, దైవత్వం మరెక్కడ లేదన్నారు, ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడాలని కోరారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అమర్నాద్ రెడ్డి, రాఘవ, కేశవ తదితరులు పాల్గొన్నారు.

About Author