PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్

1 min read

పల్లెవెలుగువెబ్ : బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా సోమవారం ఎన్నికైన సునాక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 మంగళవారం ఆహ్వానం పలికారు. ఈ పిలుపు అందుకున్న సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. ఇక అతి త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.

About Author