PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో..భార్యభర్తలు మృతి

1 min read

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

  • ఘటనలో ఇద్దరు స్పార్ట్​ డెత్​

పల్లెవెలుగు, చెన్నూరు: ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో కడప – రాజంపేట బైపాస్ DSR కళ్యాణ మండపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రగుంట్ల టౌన్ లోని వేంపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న శనివారపు భాస్కర్ రెడ్డి వయస్సు( 53) సంవత్సరాలు, అతని భార్య గంగాదేవిలు మృతి చెందినట్లు ఎస్సై చిన్న పెద్దయ్య తెలిపారు, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగుంట్ల కు చెందిన శనివారపు భాస్కర్ రెడ్డి ఆయన భార్య గంగాదేవిలు పని నిమిత్తం కడపకు వెళ్లి తిరిగి తన స్వగ్రామం ఎర్రగుంట్లకు తన ద్విచక్ర ప్రవాహనంలో బైపాస్ కడప రాజంపేట బైపాస్ గుండా వెళుతుండగా అలంకానిపల్లి బైపాస్ నుండి రాజంపేట మీదుగా వెళుతున్న AP 39 UA 3463 కారు డ్రైవర్ , అజాగ్రత్తగా అతివేగంగా నడుపుతూ AP 39GE 9898 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో లో వెళ్తున్న సేనివరపు భాస్కర్ రెడ్డి, అలాగే అతని భార్య గంగాదేవి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు, కాగా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  కడప సర్వేజనా హాస్పిటల్( రిమ్స్ )హాస్పిటల్ కి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

About Author