PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలో అగ్రగామి

1 min read

ఆధునిక సాంకేతికత, వ్యక్తిగత సంరక్షణలతో ఆర్థోపెడిక్ కేర్‌లో అగ్రగామి

అనంతపురం వాసులకు బెంగళూరు ఫోర్టీస్ హాస్పిటల్ లో

పల్లెవెలుగ వెబ్  అనంతపురం : మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి సమగ్ర రోగ నిర్ధారణ,  చి కిత్స కోసం అనంతపురం నుండి వచ్చే రోగులకు ఫోర్టిస్ హాస్పిటల్ (బన్నెరఘట్ట రోడ్, బెంగళూరు) ప్రాధా న్య గమ్యస్థానంగా రూపుదిద్దుకుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, డీజనరే టివ్ జాయింట్ డిసీజెస్ వంటి సమస్యలకు ఇది చక్కటి చికిత్సను అందిస్తోంది. రోగుల్లో చైతన్యాన్ని పునరుద్ధరించడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ డి గౌడ నేతృత్వంలోని ఆసుపత్రి మల్టీడిసిప్లినరీ బృందం, మాకో రోబోటిక్ సర్జరీ,  సంప్రదాయిక చికిత్సలతో సహా అత్యాధునిక చికి త్సల కలయికను విజయవంతంగా ఉపయోగించింది. బైలేటరల్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న రోగులకు ఫోర్టిస్ హాస్పిటల్ (బన్నెరఘట్ట రోడ్, బెంగళూరు)లో ఆర్థోపెడిక్ టీమ్ ద్వారా  విజయవంతమైన చికిత్సను అందించిన మూడు కేసులను డాక్టర్ నవీన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.శ్రీమతి శివమ్మ అనే 61 ఏళ్ల రోగి బైలేటరల్ ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఆమె తన కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పిని అనుభవించారు. ఇది ఆమె రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. ఎక్కడికైనా వెళ్లడాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. అంతేగాకుండా ఆమెకు హైపర్ టెన్షన్ కూడా ఉంది. సమగ్రంగా పరీక్షించిన తర్వాత, డాక్టర్ నవీన్ డి గౌడ నేతృత్వంలోని ఫోర్టిస్ (బన్నెర ఘట్ట)లోని ఆర్థోపెడిక్స్ బృందం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను సూచించింది. మాకో రోబోటిక్ సర్జరీని ఎంచుకున్న శ్రీమతి శివమ్మ ఆ ప్రక్రియ చేయిం చుకుని, 6 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారు.అదేవిధంగా, 62 సంవత్సరాల వయస్సు గల శ్రీ రామమూర్తి కూడా బైలేటర్ ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధ పడ్డారు. ముఖ్యంగా అతని ఎడమ మోకాలిలో. ఇది అతని రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది. బాగా పరీక్షించిన   తర్వాత, ఆయన కూడా మాకో రోబోటిక్ సర్జరీని ఎంచుకున్నారు. ఈ ప్రక్రియను జరిగిన తరువాత శ్రీ  రామమూర్తి ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారు.మరొక సందర్భంలో, 67 ఏళ్ల శ్రీ సుధాకర్ రాజు బైలేటరల్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారని నిర్ధారించబ డింది. ఇది ఆయన రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పరీక్షించిన తరువాత, ఆయన సంప్రదాయిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఎనిమిది రోజులలో డిశ్చార్జ్ అయ్యారు.అనంతపురంలో అనేక మంది వైద్యులను సంప్రదించినప్పటికీ, శస్త్రచికిత్సను చేయించుకోడా నికి అవసర మైన విశ్వాసం లేదా సరైన సమాచారాన్ని ఈ రోగులు పొందలేకపోయారు. బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పి టల్ (బన్నెరఘట్ట రోడ్) లోని డాక్టర్ నవీన్, సంప్రదాయ మరియు రోబోటిక్ సర్జరీ ఎంపికలను క్షుణ్ణంగా వివరించి, రోగులకు తగు సమాచారం అందించారు.మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల స్థితిగతుల గురించి బెంగళూరు బన్నెరఘట్ట రోడ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్  ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ డి గౌడ మాట్లాడుతూ, ‘‘సంప్రదాయ మోకాలి మరియు తుంటి మార్పి డి శస్త్రచికిత్సలు గత మూడు దశాబ్దాలుగా రోగుల జీవన నాణ్యతను పెంచాయి. అయితే మాకో  సాంకేతి కత గణనీయంగా కచ్చితత్వాన్ని పెంచుతుంది. కచ్చితమైన ప్రణాళికకు వీలు కల్పిస్తుంది. కోతలను సులభ తరం చేస్తుంది. తద్వారా ఈ మొత్తం ప్రక్రియను విప్లవాత్మకంగా మార్చింది. ఇది ఎముక, మృదు కణజా లాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది, శస్త్రచికిత్స అనంతర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కోలుకోవ డాన్ని వేగవంతం చేస్తుంది. త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా చేస్తుంది. రక్త నష్టాన్ని తగ్గిస్తుంది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల విధానాన్ని మాకో పూర్తిగా మార్చింది’’ అని అన్నారు.ఫోర్టిస్ హాస్పిటల్స్ (బెంగుళూరు) బిజినెస్ హెడ్ శ్రీ అక్షయ్ ఓలేటి ఇలా అన్నారు, ‘‘రోబోట్-సహాయక సాం కేతికతలో అగ్రగామిగా ఉన్న మాకోను పరిచయం చేస్తున్నందుకు మేం చాలా గర్వపడుతున్నాం. ఏకీకృత ప్లాట్ ఫామ్ పై పాక్షిక మోకాలు, మొత్తం మోకాలు మరియు మొత్తం తుంటి రిప్లేస్ మెంట్స్ ను  చేయడా నికి ఇది వీలు కల్పిస్తుంది. మా మూల సూత్రాలును మేం పాటిస్తాం. అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం, కచ్చితత్వం, వేగంగా కోలుకోవడం, మెరుగైన చికిత్సలకు మేంఅంకితభావంతో ఉన్నాం. ఫోర్టిస్ హాస్పిటల్ అత్యాధునికతను సజావుగా ఏకీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ వైద్య సంరక్షణను అందించ డానికి తన నిబద్ధతలో ముందంజలో ఉంది. ఈ వినూత్నతలు మా గౌరవనీయ  రోగుల ఆరోగ్యం, సంతృ ప్తిని కాపాడుతాయి’’ అని అన్నారు.ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ వ్యాధి. ఇది కాలక్రమేణా తీవ్రమవుతుంది, తరచుగా దీర్ఘకాలిక నొప్పి కి దారితీస్తుంది. కీళ్ల నొప్పులు మరియు దృఢత్వం అనేవి రోజువారీ పనులను కష్టతరం చేసేంత తీవ్రంగా మార వచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి మరియు వైకల్యం వలన నిరాశ, నిద్ర ఆటంకాలు ఏర్పడవచ్చు. నొప్పి నిర్వహణలో సకాలంలో వ్యాధి నిర్ధారణ, సరైన చికిత్స ఎంతో ముఖ్యం.ఫోర్టిస్ హెల్త్‌ కేర్ లిమిటెడ్ గురించిఫోర్టిస్ హెల్త్‌ కేర్ లిమిటెడ్ – ఒక IHH హెల్త్‌ కేర్ బెర్హాద్ కంపెనీ – భారతదేశంలో ఒక ప్రముఖ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్. ఇది 28 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, 4,500+ ఆపరేషనల్ బెడ్‌లు (O&M సదుపాయాలతో సహా) మరియు 400 కంటే ఎక్కువ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లతో (JVలతో సహా) దేశంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటి. ఫోర్టిస్ భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నేపాల్ & శ్రీలంకలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ బీఎస్ఈ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఆఫ్ ఇండియాలో లిస్ట్ చేయబడింది. ప్రపంచ స్థాయి రోగి సంరక్షణ, అత్యున్నత స్థాయి  క్లినికల్ ఎక్సలెన్స్ సంస్కృతిని పెంపొందించడానికి ఇది అంతర్జాతీయ అగ్రగామి, మాతృ సంస్థ అయిన IHHతో దాని భాగస్వామ్యం నుండి బలాన్ని పొందుతుంది. ఫోర్టిస్ ~23,000 మంది సిబ్బందిని (అజి లస్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్‌తో సహా) కలిగి ఉంది. వారు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన ఆరో గ్య సంరక్షణ నెట్‌వర్క్‌ గా మారాలనే సంస్థ తాత్వికతను పంచుకున్నారు. ఫోర్టిస్ క్లినిక్‌ల నుండి క్వాట ర్నరీ కేర్ ఫెసిలిటీస్ మరియు విస్తృత శ్రేణి అనుబంధ సేవల వరకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవల యొక్క పూర్తి పరిధిని అందిస్తుంది.

About Author