సరిహద్దులు చెరిపేసిన ఆర్ఆర్ఆర్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత ప్రాంతీయ చలనచిత్రరంగ హద్దులను చెరిపేయడం ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ సరికొత్త చరిత్ర సృష్టించనుందని హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర పట్టణంలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అశేష జనసంద్రాన్ని ఉద్దేశించి ఎన్టీఆర్ ప్రసంగించారు. చిక్కబళ్లాపురలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కర్ణాటక నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చిత్రదర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ నా రాముడు నా భీముడు అంటూ ఇద్దరు హీరోలను అభిమానులకు పరిచయం చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ తన కెరీర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ అద్భుతమైన సినిమా కానుందన్నారు. కర్ణాటక ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.