NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. కోటి 25లక్షలతో సేవా కార్యక్రమాలు

1 min read
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్​

మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్​

కోవిడ్​’తో రెండేళ్లు గడపాల్సి వస్తుందని ముందే చెప్పా..
– రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్​… తన పుట్టిన రోజు సందర్భంగా కర్నూలు ప్రజలకు మరో వరం ప్రకటించారు. కర్నూలు నగరంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజల కోసం రూ. కోటి 25 లక్షలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్​ పుట్టిన రోజును పురస్కరించుకుని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన టిజివి కళా సాహితీ వేదిక ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యవర్గ సభ్యులు ఇనయతుల్లా, మహ్మద్ మియా, లక్ష్మీకాంత్, శ్రీనివాసరెడ్డి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూల్ నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజల కోసం ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా రూ. 65 లక్షలు వ్యయంతో కర్నూలు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్లను ఏర్పాటు చేస్తామని, మరో రూ.60 లక్షలతో తమ నైట్రోజన్ ప్లాంటును ఆక్షిజన్ ప్లాంట్ గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయనున్నట్లు చెప్పారు. ఇందులోనే వెంటిలేటర్ లతోపాటు మల్టీ పారామీటర్ మానిటర్ ను ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.


కళాకారులకు సరుకులు పంపిణీ : కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రాజ్య సభ సభ్యలు టీజీ వెంకటేష్​. కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ రూల్స్​ పాటించాలని, మాస్క్​ ధరించి, శానిటైజర్ వాడి, భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీసులకు, వైద్యులకు పూర్తిస్థాయిలో సహకరిస్తే.. కోవిడ్​ను నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

About Author