PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శభాష్​..రేవంత్​: ’శంకరాస్​’ డైరెక్టర్​ హరికిషన్​

1 min read

ఓపెన్​ ఛాంపియన్​ షిప్​ కాట (కరాటే) ఈవెంట్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించిన రేవంత్​ కుమార్

అభినందించిన కళాశాల డైరెక్టర్​ బి. హరికిషన్​

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నగరంలోని ప్రముఖ ఇంజనీరింగ్​ కాలేజి ‘శంకరాస్​ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. రేవంత్​ కుమార్​ ఓపెన్​ ఛాంపియన్​ షిప్​ కాట ఈవెంట్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించారు.  ఫిబ్రవరి 26న ఒంగోలులో ఓపెన్​ ఛాంపియన్​షిప్​ కాటా(కరాటే) ఈవెంట్స్​ జరిగింది. పోటీలో మొత్తం 350 మంది పాల్గొనగా… కర్నూలు శంకరాస్​ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. రేవంత్​  కుమార్​ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి పొందారు.  మంగళవారం కళాశాల ఆవరణలో డైరెక్టర్​ బి. హరికిషన్​, లెక్చరర్​ మద్దిలేటి విద్యార్థి రేవంత్​ కుమార్​ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గోల్డ్​ మెడల్​ సాధించిన రేవంత్..గతంలో పలు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాడని, మున్ముందు మరెన్నో పథకాలు సాధించాలని శ్రీ శంకరాస్​ డిగ్రీ కళాశాల డైరెక్టర్​ బి. హరికిషన్​ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఉన్నారు.

About Author