PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కూటీ అదుపుతప్పి… ఇద్దరికి గాయాలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరంలో స్కూటీ అదుపుతప్పి ఇద్దరు సచివాలయం మహిళ పోలీసులకు గాయాలయ్యాయి. తెలిసిన వివరాల మేరకు మండలంలోని గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై నిర్వహించనున్న సమావేశానికి మంగళవారం హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా యర్రగుడిదిన్నె గ్రామ సచివాలయం మహిళా పోలీసు రిబక పేరూరు గ్రామ సచివాలయం మహిళా పోలీసు మనోరంజని సమావేశానికి హాజరయ్యేందుకు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ లో సమావేశం అయ్యేందుకు స్కూటీ మీద బయలుదేరారు. ఈ క్రమంలో రుద్రవరం గ్రామం చేరుకోగానే అమ్మవారి శాల సెంటర్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కింద పడడంతో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు మహిళా పోలీసు రిబకను 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళా పోలీసులు ప్రమాదానికి గురయ్యారు అన్న సమాచారం అందుకున్న ఎంపీడీవో మధుసూదన రెడ్డి ఏవో వరలక్ష్మి పంచాయతీ రాజ్ ఏఇ వెంకటరాముడు సీనియర్ అసిస్టెంట్ షడ్రక్ మండల పరిషత్ సిబ్బంది సచివాలయం సిబ్బంది తోటి మహిళా పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మహిళా పోలీసులను పరామర్శించారు.

About Author